అధికారం ఉన్నవాడివి
ఇంకా బదులు కోసం ఎదురు చూస్తావేం..
నిర్ణయాల నడుమ ఈ ఆలోచనలు దేనికి
అవకాశాలు సృష్టించుకోలేవా..
ఇష్టాన్ని చూపించడానికి వెనుకాడని వాడివి
మరి అధికారం చూపించడానికి ఏమయిందీ..
నువ్వు పిలిస్తే బదులివ్వక ఉన్నానా
నువ్వు చేయి చాచితే జంకుతాననే ఈ జంకు నీకేలట..
అడిగి నాపై నమ్మకాన్ని చిన్న చూపు చేస్తావేం
అడగక ఇచ్చిన మనసు కన్నానా..
నీ జీవితాన్నే నాతో ముడివేస్తే కాదంటానా
నీ జతగా నే మనలేనంటానా...
వినపడిందా..
ఓయ్ నిన్నేనోయ్..
నీ డైలాగులు నేనే చెప్పేసా ఇక కానీయ్..
✍️అరుణిమలు
No comments:
Post a Comment