ఎలా రాసేది....
ఎన్నో యుగాల కాలం గడిచాక దొరికిన కొన్ని ఘడియలను..
ఏమని రాసేది...
దోచిన కాలంలో దాచుకున్న దోసెడు క్షణాలను గుప్పెడు అక్షరాలలో..
నాలుగు కళ్ళు పలికిన పలకరింపులు..
రెండు అరచేతుల ఆలింగనాల వేడి..
కలిసి పడిన అడుగుల గురుతులు..
గతాన్ని పక్కన పెట్టి... భవిష్యత్తును ఊహకు రానివ్వకుండా..
ఇలా ఈ క్షణాలను కడుపు నింపుగా నింపేసుకొని..
మళ్ళీ మళ్ళీ ఎదురు రాని కాలాన్ని కౌగిలించుకొన్న ఙ్ఞాపకాలను..
ఆ ఒడ్డున కట్టిన మన ఆశల సౌధాలను
అప్పుడే పడిన అడుగుల గురుతులను చెరిపేస్తూ..
వెను తిరిగి నిను వదిలి పోయే తరుణంలో..
గుండెల భారం కన్నుల నుండి జారుతుంటే..
ఉంటానిక అని చెప్పిన బరువైన వీడ్కోలును..
రాసేయనా....
లోకం గమనించని
కాలం కనికరించని
మనమనే మనల్ని...!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment