నీ మనసులో నేను మాత్రమే ఉన్నాననే నమ్మకమే
నన్ను ముంచేసిందోయ్...
మునిగింది నీ గుండెల్లోనే ఏమో
గుబులు లేని గుబురు పొదరింట్లో కొలువై పోయా..
తేలిపోయా నీ తలపులలో ఊరేగుతూ
తుళ్ళి పడే యవ్వనాలను దాచేసుకోవయ్యో..
కలిసిన రోజున కుమ్మరించేయ్
నీ కుశలాల కుసుమాలను..
పెదవుల పై పురివిప్పిన నవ్వులను
దాచేస్తున్న నీకై...
గలగలా పారే ఊసులను పదాలుగా మార్చి
మాల కడుతున్న నిను అలంకరించేందుకు..
✍️అరుణిమలు
No comments:
Post a Comment