మనం అనే మనసాక్షరాలను లిఖించేసా నీకై
మనల్ని పొదిగి అలంకరించి దాచేసా ఈ మనసు పుస్తకంలో...
పదం పదంలో మనం కలసి వేసిన అడుగులు
కలిసి గడిపిన క్షణాలను బంధించేసాను
నీ తలపులు సుగంధాలలో
నే మైమరచిన క్షణాలను మరీ మరీ ఇష్టంగా దాచేసుకున్న...
బాధను మింగేసిన ప్రేమను
ప్రేమను దోచేసిన ఇష్టాన్ని
నువ్వు జయించిన ఈ మనసును
అక్షరాల సాక్షిగా ఇచ్చుకున్న వాగ్ధానాలను
ఏం లేదోయ్ ఈ పదకేళిలో
కన్నీరు నుండి అందులో కరగి పోని నా ప్రేమ వరకు
గంగనై సాగిన నా పయనంలో
ప్రతీ క్షణం ఒక పదమై ఒదిగి పోయింది
కోపాలెన్నో మన మధ్య
అక్షరాల వారదే కదా కలిపేది
రాయని ప్రేమలేఖలు ఎన్నో
రాసిన ఈ పద కవితల నడుమ దాగుని ఉన్నాయి
నువ్వుగా కాదోయ్
మనం అని చదువు
అహం కాదు అలంకారమైన
నా ప్రేమ కనిపిస్తుంది ❤❤
✍️అరుణిమలు
No comments:
Post a Comment