Wednesday, 8 August 2018

తాను నేను

నాలో కనిపించని నవ్వుకు
కనిపించే నిరాశకు కారణం నువ్వే

నేను అనే నిజానికి దూరమై
నువ్వనే అబద్దానికి దగ్గర అయ్యానేమో
ఫలితం ఎంత భారంగా ఉందో

నీ ఊహలకు ఆయువు ఎక్కువ
నా ఆశలకు ఆయుష్షు తక్కువ

ఏంటో...

నువ్వు కావాలి అంటావు
కలవడానికి కూడా అనుమతి అడుగుతావు..
జీవితాంతం తోడుంటా అంటావు
జతగా నడవడానికి జంకుతావు..

నిను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే నిజంగా..
ఇంకా ఇంకా నిను వదలని నా తలపులు
చిత్రమే విచిత్రమే సుమీ..

✍️అరుణిమలు

No comments:

Post a Comment