నీ మాటలో ఏ మాట దాగుందో అని వెతకని రోజులే నయం...
ప్రతీ పదాన్ని పొందికగా పేర్చి మురిసేదాన్ని...
మాటలో లోతులు తెలియదు కానీ నీ మనసు లోతుల నుండి వచ్చింది అనే నమ్మకం నా మనసును కదిలించేది...
ఆశలను నింగికి ఎగుర వేయగలను అనే ధైర్యం అప్పుడు...
నీ ప్రతీ పులుకులో పజీలీలే ఉన్నాయని తెలియని తనం...
ఎన్ని చిక్కు ముడులో వాటిలో అనేది నేను చిక్కే వరకు తెలియలేదు ...
నీ చేతలు ఒకటి అయినా నీ మాట నా ఆలోచనలను అదుపు చేసేది...
నమ్మకం అంటే నువ్వు కాదని తెలిసాక కూడా నిన్ను నిందించానేమో కానీ నమ్మకుండా ఉండటం ఎలాగో చెప్పలేదు నా పిచ్చి మనసు...
నీకు దూరంగా ఉండటం అంటే నేలను నీడ తాకను అన్నట్టే ఉంటుంది..
నీకు దగ్గర అవడం అంటే మరోసారి నీ ఆటకు నేను పావును అవ్వడమే కదా..
మనసెరిగిన దానినే కానీ
మళ్ళీ మళ్ళీ నన్ను నేను కోల్పోలేను
నా దూరం నీకెప్పుడూ దగ్గరగానే నన్ను ఉంచుతుంది
దూరానికి కూడా తెలియదు బహుసా
నన్ను నీకు దూరం చేయడం ఎలాగో..!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment